Sunday, June 14, 2020

Books have been my greatest company during this corona time and I have been able to finish reading 3-4 books in these last couple of months.
 The one I just finished reading is a Telugu book called “Itla Sutha” ,” Kurushetra Rahitha Mahabharata Gatha” which was given to me by my co-brother Srinivas Dy Commissioner (Customs&CE), and insisted that I should read it without fail, as it is written in purely old colloquial Telangana dialect, and subject though relating to Mahabharata, author Sri Varigonda Kantharao, fictionalised or reimagined it in a way he can do away with the Kurushetra Yudha. So to avert the war between Pandavas & Kauravas,  he made Karna switchover to Pandavas' side, as he is the firstborn son of Kunti. All this is hypothetical analysis but very nicely done. As I'm not used to writing Telugu on a keyboard, I'm directly posting the gist from the book here for a better appreciation of my FB friends.
ఇట్ల సుత’ ఒక అపురూప రచన. మహాభారత కథ దీనికి భూమిక. మహాభారత యుద్ధం జరగకుండా ఉండి ఉంటే ఎట్లా ఉండేది అన్న ఆలోచనే దీనికి మూలం. జననష్టదాయకమైన యుద్ధ నివారణకు ఒకటే ఒక మార్గం ఉంది. అది కర్ణుని యుద్ధ వైముఖ్యం. దాన్ని కేంద్రంగా తీసుకుని ఈ బృహద్రచన సాగింది. దౌత్య సందర్భంలో కర్ణునితో జరిగిన శ్రీకృష్ణుని సమావేశమే ఈ రచనకు ప్రాణం. తన ఆలోచనలకు అంగీకారం తెలిపిన కర్ణుడు పాండవ పక్షంలో చేరిపోవడంతో యుద్ధం సంశయగ్రస్తమైంది. దీనికి తోడు కుంతి కూడా కర్ణుణ్ణి కలవడం కూడా యుద్ధనివారణలో మరో ప్రధాన హేతువు. ఈ రెండు హేతువుల కారణంగా కర్ణుడు పాండవ శిబిరానికి రావడం వల్ల, ఇక్కడి నుండి కథ కొత్త మలుపులు తీసుకుంది. చివరకు యుద్ధం ఆగిపోయింది. ఇదీ స్థూల విషయం.

ఇందులో కర్ణునితోబాటు భీష్ముడు, కృష్ణుడు, శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు మొదలైన పాత్రల చిత్రణ చాలా విశేషంగా కనిపిస్తుంది. పాఠకుణ్ణి లోతుగా మూలాల్లోకి వెళ్ళి ఆలోచింపజేస్తుంది. కాని భారతమూలకథకు, ధర్మజుని పట్టాభిషేకానికి కర్ణ, దుశ్శాసనాదుల మరణానికి మాత్రం ఎటువంటి ఆటంకమూ కలుగకపోవడం విశేషం. కాకపోతే మరణాలు మరో కారణంగా సంభవిస్తాయి. అందుకే దీన్ని రచయిత "కురుక్షేత్ర యుద్ధ రహిత వచన కావ్యం" గా చెప్పాడు. ఈ రచనలో మరో ముఖ్యమైన విశేషం ఉంది. అది భాష విషయం - ఈ మొత్తం రచన తెలంగాణా భాషలోనే సాగడం ఒక ప్రత్యేకత. చాలా సాఫీగా, ఎక్కడా కృత్రిమత లేకుండా రచన సాగించిన వరిగొండ కాంతారావు గారు అభినందనీయుడు.